warangal jeep accident: బ్రేకింగ్: బావిలో పడ్డ జీపు.. లోపల 16 మంది ప్రయాణికులు – passenger jeep went into a well in warangal rural districts sangem


వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులో మంగళవారం ఓ జీపు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఆ సమయంలో జీపులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. వరంగల్ నుంచి నెక్కొండ వైపు ప్రయాణికులను తీసుకొని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు జీపులోని పన్నెండు మంది ప్రయాణికులను క్షేమంగా బయటికి తీసినట్లు సమాచారం. మరో నలుగురు ప్రయాణికులు నీటిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికుల ద్వారా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక కార్యక్రమాలను చేపట్టారు. జేసీపీ సాయంతో జీపును బయటకు తీసే చర్యలు చేపట్టారు. బావి మొత్తం నీటితో నిండి ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే 12 మంది ప్రయాణికులను రక్షించగా.. బయటకు వచ్చిన వారు బావిలోనే చిక్కుకుపోయిన తమ వారికోసం రోదిస్తున్నారు.

పోలీసులు మాత్రం మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వాహనంలో ప్రయాణించే 16 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఎవరెవరు ఆ వాహనంలో ప్రయాణం చేశారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Also Read: టీఆర్ఎస్ మరింత బరితెగించింది.. విజయశాంతి ఘాటు విమర్శలు

Also Read: Hyd-తిరుపతి మధ్య కొత్త షార్ట్‌ కట్.. బాగా తగ్గనున్న దూరం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *