weight loss tips: ఎన్ని చేసినా బరువు తగ్గట్లేదా.. ఇవే కారణాలు కావొచ్చు.. – reasons why not losing weight know here


జంక్ ఫుడ్, ఫ్రైస్, చిప్స్.. ఇలాంటివన్నీ బరువు పెరగడానికి కారణం అవుతాయని మనందరికీ తెలిసిన విషయమే. దానికి తోడు మన లైఫ్ స్టైల్, ఎక్సర్‌సైజెస్ చేయకపోవడం, సరైన టైమ్‌కి తినకపోవడం వంటివి అన్ని డయాబెటీస్, కాన్సర్, హార్ట్ ప్రాబ్లంస్ కి కారణమవుతాయని కూడా మనకి తెలిసిన విషయమే. కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, బరువుని అదుపులో పెట్టుకోడానికి ట్రై చేస్తున్నాం. అయినా కూడా, బరువు తగ్గట్లేదా? మనకి తెలియకుండానే చేసే కొన్ని తప్పులు బరువుని పెంచుతాయి.. అవేంటో తెలుసుకోండి.

​1. లో-ఫ్యాట్ ఫుడ్స్

samayam telugu

బరువు పెరగడానికి ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా కారణం అవుతాయని అనుకుంటాం. ఫ్యాట్ కంటే కూడా షుగర్ వల్లే ఎక్కువ బరువు పెరుగుతాం. అందుకని మనం లో-ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం. ఇందులో మనకి తెలియనిదేంటంటే ఫ్యాట్ తగ్గినప్పుడు అందులో షుగర్ పెరుగుతుంది. ఈ లో ఫాట్ ప్రోడక్ట్స్ లో ఉండే షుగర్‌ని బాడీ తొందరగా స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ వెంటనే ఆకలి వేస్తుంది. అదే హెల్దీ అన్ శాచ్యురేటెడ్ ఫాట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు.

​2. ఫాస్ట్ గా తినడం

samayam telugu

కొంతమంది చాలా త్వరత్వరగా అన్నం తింటుంటారు. కానీ నెమ్మదిగా తినడం చాలా మంచిది. ఎందుకంటే, మనకి కడుపు నిండిన తరువాత ఆ విషయం బ్రెయిన్ కి అందడానికి ఇరవై నిమిషాలు పడుతుంది. మనం ఫాస్ట్ గా తింటున్నప్పుడు బ్రెయిన్ కి విషయం అర్ధమయ్యేలోపే మనం ఎక్కువ తినేస్తాం. దాంతో మనం తినాల్సిన దానికంటే ఎప్పుడూ ఎక్కువే తింటాం. కాబట్టి నిదానంగా తినండి.

Also Read : పొగాకు తింటే గుండె సమస్యలు వస్తాయా..

​3. ఒక పూట మానెయ్యడం

samayam telugu

ఒక పూట భోజనం మానేస్తే ఏమవుతుందిలే కొన్ని కాలరీలు కూడా తగ్గుతాయని మనం అనుకుంటూ ఉంటాం. ఇది రెండు కారణాల వల్ల తప్పు. ఒకటి, ఒక పూట మానెయ్యడం వల్ల మెటబాలిజం స్లో అవుతుంది, దాంతో కాలరీలు తొందరగా బర్న్ అవ్వవు. రెండోది, ఒక పూట తినకుండా ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఆల్వేస్ రెండో పూట ఎక్కువ తింటాం.

​4. నిద్ర సరిపోకపోవడం

samayam telugu

నిద్రకీ బరువు కీ ఏం సంబంధం అనిపిస్తుంది కదా. నిద్ర సరిపోనప్పుడు కార్టిసోల్ అనె స్ట్రెస్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది షుగర్ ని ఇన్సులిన్ గా మార్చే ప్రక్రియ ని అడ్డం కొడుతుంది. దాంతో ఆ షుగర్ అంతా ఫాట్ గా మారుతుంది. మాములూగా కూడా నిద్ర సరిపోనప్పుడు మనకి వచ్చే చిరాకులో మనం కంఫర్ట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం. అదంతా కలిపి ఫ్యాట్ గానే మారుతుంది కదా.

Also Read : పాలు తాగితే జీర్ణ సమస్యలు వస్తున్నాయా.. ఇదే కారణం కావొచ్చు..

​5. పెద్ద ప్లేట్స్ లో తినడం

samayam telugu

ఎప్పుడైతే పెద్ద ప్లేట్స్ లో తింటామో అప్పుడు మనకి తెలియకుండానే ఎక్కువ ఫుడ్ పెట్టుకుంటాం. చిన్న ప్లేట్స్ తో ఆ సమస్య రాదు. ప్లేట్ నిండుగా ఉన్నట్టనిపిస్తుంది కాబట్టి మనకి కడుపు నిండుగా తిన్నట్టనిపిస్తుంది. ఇంకో విషయం, రెడ్ కలర్ ప్లేట్స్ లో తింటే తక్కువ తింటామట.

​6. ఏం తాగుతున్నారో తెలుసుకోండి..

samayam telugu

మనం కాలరీలు కౌంట్ చేసేటప్పుడు ఏం తిన్నామన్నదాని గురించే ఎక్కువ ఆలోచిస్తాం. కాఫీ, టీ, జ్యూసులూ, సోడాలూ, అసలు గుర్తే రావు. కానీ, అందులో కూడా కాలరీలు ఉంటాయి కదా. ఇంక బీర్, వైన్ లాంటివి చెప్పక్కర్లేదు. అవి ఎవరూ కంట్రోల్ లో పెట్టుకోలేరు. కాబట్టి ఇకనుంచి వీటి గురించి కూడా ఆలోచించండి..

​7. మొబైల్స్ చూస్తూ..

samayam telugu

టీవీ చూస్తూ తినడం, మొబైల్ లో చాట్ చేస్తూ తినడం, నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినడం, బాస్ మీద కోపంతో ఉన్నప్పుడు తినడం… తినడం మీద కాక ఇంక దేని మీద ధ్యాస ఉంచినా ఎంత తింటున్నామో తెలీదు. మనం ఎవాయిడ్ చేయలేని విషయాలని ఏం చెయ్యలేం కానీ చెయ్యగలిగిన విషయాల దగ్గర జాగ్రత్త పడడం మంచిది.

Also Read : భార్యలు సెక్స్ విషయంలో ఇవే ఎక్స్‌పెక్ట్ చేస్తారు

​8. ప్లాన్ చేసుకోకపోడం

samayam telugu

మీకు బాగా ఆకలేసేవరకూ ఏం వండాలో ఆలోచించుకోకపొతే అంత ఆకలి మీద ఎప్పుడూ తేలిగ్గా అయిపోయే పదార్ధాలే వండుతాం. తేలిక గా అయిపోయే పదార్ధాలు ఎప్పుడూ కొవ్వు పెంచుతాయి. వేపుళ్ళు లాంటివి. అందుకే, ముందే ఏం వండాలి అని ఆలోచించుకుని పెట్టుకుంటే ఆ ప్రకారం వంట అయిపోతుంది. బరువు అన్నది బాడీ కి సంబంధించినదే అనుకుంటాం. కానీ, అందులో మైండ్ పాత్ర కూడా చాలా ఉంది. ఈ పైన చెప్పిన వాటిల్లో మీకు కూడా ఏవైనా అలవాట్లు ఉన్నాయా? ఉంటే, వెంటనే మార్చుకోండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *