Wife boyfriend: ‘నా భార్య.. తన ప్రియుడిని అన్నయ్య అంటోంది, పెళ్లికి ముందే అతడితో..’ – my wife had a very serious relationship with her boyfriend before marriage


సమస్య: నాకు ఆరు నెలల కిందటే పెళ్లయ్యింది. మూడు నెలల తర్వాత నా భార్యకు తన ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. శరీరకంగాను కలిసినట్లు తెలిసింది. మాది ఎంతో సాంప్రదాయక కుటుంబం. ఇలాంటివి తెలిస్తే.. మా కుటుంబికులు అస్సలు క్షమించరు. మొదట్లో నా భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడేది. అవతలి వ్యక్తిని పదే పదే బయ్యా (అన్నయ్య) అని పిలుస్తుండేది. అయితే, అతడిని మళ్లీ తనకు ఫోన్ చేయొద్దని చెబుతుండేది. దీంతో అనుమానం వచ్చి అతను ఎవరు అని అడిగాను. అప్పుడు అసలు విషయం చెప్పింది. అతడు తన అన్నయ్య కాదని.. తన మాజీ ప్రియుడని చెప్పింది. తన గతం అంతా నాకు వివరించింది.

మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని ఆమెను అడిగాను. ‘‘నీ ఫొటో చూసిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాను. కానీ, నిన్ను కలిసిన తర్వాత నా నిర్ణయం మార్చుకున్నా. నువ్వు చాలా కూల్‌గా కామ్‌గా ఉన్నావని పెళ్లికి అంగీకరించాను’’ అని తెలిపింది. జరిగిందేదో జరిగిపోయింది, అంతా మరిచిపోదామని నేను అనుకున్నా. కానీ, తన గతం చెప్పిన తర్వాత ఆమెలో ధైర్యం పెరిగింది. అప్పటి నుంచి ఆమె అతడితో పదే పదే ఫోన్లో మాట్లాడేది.

ఓ రోజు నాకు బాగా కోపం వచ్చింది. అతడిని కొట్టేస్తాను అని గట్టిగా అరిచా. దీంతో ఆమె నవ్వుతూ.. ‘‘నువ్వు అతడిని కొట్టలేవు. అతడు సీఆర్‌పీఎఫ్ ఉద్యోగి. చాలా బలంగా ఉంటాడు’’ అని తెలిపింది. ఆమె అలా అనడానికి కారణం నేను సన్నగా.. పొట్టిగా ఉండమే కారణం. ఆమె అతడి గురించి అలా చెప్పేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. ఆమె తన గతం గురించి, మాజీ ప్రియుడి గురించి చెబుతూ నన్ను బలహీనుడిగా చిత్రీకరిస్తోంది. నేను చాలా చాలా డిప్రషన్‌లో ఉన్నాను. ఏం చేయాలో చెప్పండి ప్లీజ్.
– ఓ సోదరుడు (ప్రైవసీ నిమిత్తం బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచాం)

సలహా: ఇప్పుడు మీరున్న పరిస్థితిని ఆధారంగా చూస్తే.. మీ ఇద్దరి మధ్య బంధం ఇంకా బలోపేతం కావాలి. ఇప్పుడు అనుభవిస్తున్న ఆ బాధను మీ భార్యకే చెప్పగలగాలి. అయితే, అది ఆగ్రహంతో కాకుండా ప్రేమతో వ్యక్తం చేయాలి. ఆమెను స్వీకరించే విధంగా మీరు చెప్పే తీరు ఉండాలి. మీరు ఆమె గతాన్ని విన్నారు కాబట్టి.. అదే మార్గంలో ఆమెను కూడా మీ బాధను అర్థం చేసుకోవాలని చెప్పండి. ఆమెతో మీ బాధను వ్యక్తం చేయడానికి ఏది సరైనా మార్గమనేది మీరే ఆలోచించుకోవాలి. అది మీ మధ్య బంధాన్ని బలోపేతం చేయాలి.

Read Also: ఈ 8 రాశులవారు తమ భాగస్వామిని చీట్ చేస్తారట, ఎందుకంటే..

మీరు ఆవేశంగా చెప్పే విషయం.. మీ మీద మరింత చులకన భావాన్ని, వ్యతిరేకతను కలిగిస్తుంది. కాబట్టి.. మీరు ఆమెలో నమ్మకాన్ని కలిగించేలా, భద్రతను పెంపొందించేలా వ్యవహరించాలి. ఆమె మీలో బలహీనతలను ఎత్తిచూపుతుందనే విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి. ఆమె గతాన్ని తవ్వడం.. దాన్ని పదే పదే గుర్తు చేయడం, తప్పును ఎత్తి చూపడం వంటివి అస్సలు చేయొద్దు. మీ ప్రత్యేకతను ఆమెకు తెలియజేసేలా మరింత ప్రేమగా వ్యవహరించండి. ఆమెను మెప్పించడం.. నిత్యం ఆమెతో మాట్లాడుతూ.. పరాయి వ్యక్తిని మరిచిపోయేలా చేయడానికి ప్రయత్నించండి.

Read Also: ‘నా అత్త.. పని మనిషితో అలా చేయడం అసహ్యంగా ఉంది, ఆమెతో అన్నీ…’

నిపుణులు: కమ్నా చిబ్బర్, క్లినికల్ సైకాలజిస్ట్, హెడ్ – మెంటల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ విభాగం, ఫోర్టిస్ హెల్త్‌కేర్

(‘టైమ్స్ ఆఫ్ ఇండియా- లైఫ్‌స్టైల్’ సౌజన్యంతో..)Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *