Women Sexual Feelings: భార్యలు సెక్స్ విషయంలో ఇవే ఎక్స్‌పెక్ట్ చేస్తారు – things women want from their husband know here


కొంతమందికి పెళ్ళై చాలా సంవత్సరాలైనా భార్యభర్తలు కలిసి ఆనందంగా ఉన్నట్టు అనిపించదు. ఇద్దరికీ ఒకరికి ఒకరు ఇష్టమో తెలియదు..ఇలాంటి మీరు అవస్థ పడుతున్నారా? ఇద్దరి మధ్యా సరైన కమ్యూనికేషన్ లేకపోతే వచ్చే ప్రాబ్లం ఇది. అలాగని ఎవ్వరూ నోరు తెరిచి చెప్పుకోరు. ఆటోమేటిగ్గా అవతలి వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు. చెబితే బావుండదేమో అని అనుకుంటారు. కానీ, ఈ టిప్స్ పాటించండి. అప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది.

​1. ఎక్కువగా మాట్లాడాలి..

samayam telugu

కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే, రిలేషన్ కూడా సరిగ్గానే ఉంటుంది. ఓపెన్ కన్వర్జేషన్స్ వల్ల అపార్ధాలు తొలగిపోయి భద్రతా భావం ఏర్పడుతుంది. అన్నీ క్లియర్ గా చెప్పకపోతే, అడగకపోతే నన్ను నమ్మరా అని అనుకోవద్దు. నమ్మడం వేరు, తెలియడం వేరు. పైగా ఈ కన్వర్జేషన్స్ లో కమ్యూనికేషన్ మాత్రమే కాదు, లవ్ ఎండ్ అఫెక్షన్ కూడా ఉంటాయి. అటెన్షన్ ఉంటుంది. అవన్నీ మీరిద్దరూ కలిసి టైమ్ స్పెండ్ చెయ్యకపోతే కుదరవు కదా. అలాగని ప్రతి రోజూ ఇదో డ్యూటీలా చేయక్కర్లేదు. మీకూ, ఆవిడకీ కంఫర్టబుల్ గా ఉన్న టైమ్‌ని ఇలా స్పెండ్ చేస్తే మంచిది, అంతే.

Also Read : పిల్లలకి ఈ ఆహారం పెట్టండి.. ఎంతో హెల్దీ..

​2. సెక్స్ అంటే..

samayam telugu

ఇది మనిషికీ మనిషికీ మారుతుంది కానీ సెక్స్ తరవాత మీ వైఫ్ అన్ హాపీగా ఉంటే మాత్రం ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ ని అర్ధం చేసుకోండి. సెక్స్ కంటే ముందు ఆవిడతో కొంచెం సమయం గడపాలని ఆవిడ కోరుకుంటుందో అడిగి తెలుసుకుండి.. ఆవిడ చేతులు పట్టుకుని కబుర్లు చెప్పండి, హగ్ చేసుకోండి, ఆవిడ చెవిలో రొమాన్స్‌కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పండి. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ తీసుకోవాలని ఆవిడ కోరిక, దాన్ని గుర్తించండి. అప్పుడు ఆ ఎక్స్పీరియెన్స్ ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందో మీకే తెల్సుస్తుంది.

Also Read : సర్వికల్ స్పాండిలోసిస్‌ని తగ్గించే చిట్కాలివే..

​3. బ్రేక్ ఇవ్వండి..

samayam telugu

మీ ఫ్రెండ్స్ తో మీరు గడిపే సమయాన్ని మీ భార్య అర్ధం చేసుకున్నట్లే, తన ఫ్రెండ్స్ తో తను గడిపే సమయాన్ని మీరు కూడా అర్ధం చేసుకోవాలని ఆవిడ డెఫినెట్ గా అనుకుంటారు. ఇలాంటి అవకాశాలను మీరు ఆవిడకి ఇస్తే వారు పొందే సంతోషమే వేరు. ఒక రోజు ఆవిడని పూర్తిగా వదిలేయండి. ఆవిడ ఇష్టఇష్టాలని సపోర్ట్ చెయ్యండి. అది ఆవిడకెంత నచ్చుతుందో మీరే చూడండి.

​4. పనుల్లో సాయం

samayam telugu

కొంతమంది డైరెక్ట్ గా అడిగినా కొంతమంది ఈ విషయంలో మొహమాటపడతారు. ఇంట్లో కొన్ని పనుల్లో సాయం చేయడం, పిల్లల పనులు చూసుకోవడం లాంటివి చేస్తే భార్యకి కాస్తా రిలీఫ్ గా ఉంటుంది. మీరు వారంలో కొన్ని గంటలు పిల్లలతో గడపడం, వాళ్ళతో హోం వర్క్ చేయించడం, వాళ్ళతో ఆడడం లాంటివి చేయొచ్చు. మీ భార్యకి వంటలో సాయం, గిన్నెలు కడగడంలో సాయం కూడా చేయొచ్చు. లేదా ఒక పూట వంట పూర్తిగా మీరే చెయ్యచ్చు, ఆవిడ ఆనందానికి అంతే ఉండదు. ఆవిడకి ఉండే వంద పనుల్లో మీరు చేసే చిన్న హెల్ప్ కూడా ఆవిడకి ఎంతో రిలీఫ్ ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి.

Also Read : వాటర్ బాటిల్‌లోని నీరు తాగుతున్నారా.. అయితే, మీకోసమే..

​5. నిజాయితీగా ఉండాలి..

samayam telugu

మీరు ఆవిడతో నిజాయితీ గా ఉండాలనీ, ఆవిడని నమ్మాలని ఎక్స్పెక్ట్ చెయ్యడం లో తప్పు లేదు కదా. మీ కలలూ, మీ కోరికలూ మీకున్నప్పటికీ, మీ ఇద్దరి బాంధవ్యం కంటే అవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా మీరే జాగ్రత్తపడాలి. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, ప్రామిస్ బ్రేక్ చెయ్యడం లాంటివాటికి అసలు స్థానం లేదు. ఇంకా అపార్ధాలు ఉంటే మీరిద్దరూ కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవడం మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *