Workout at home: ఈజీగా ఇంట్లోనే చేసే ఈ వర్కవుట్స్‌తో త్వరగా బరువు తగ్గొచ్చు.. – the best at home workouts for weight loss


ప్రస్తుతం మనం ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం. ఉదయం లేచిన దగ్గిర నుంచి రాత్రి పడుకునే వరకు బిజీ బిజీగా సమయాన్ని గడుపుతుంటాం. కొన్ని సార్లు కుటుంబం, పిల్లలతో, ఆఫీస్ పనులతో బిజీగా ఉంటున్నా.. దీంతో ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించడం కష్టంగా మారింది. మన కోసం శ్రద్ద తీసుకునే సమయం కూడా లేదు. దీంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నాము. ఈ ఒత్తిడికి దూరంగా ఉండాలంటే రోజువారీ వ్యాయామం తప్పనిసరి. దీని వల్ల చక్కటి శరీరాకృతి, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే ఇందుకోసం జిమ్‌లలో అన్ని రకాల ఎక్విప్‌మెంట్స్‌తో కుస్తీలు పట్టాల్సిన అవసరం లేదు. గంటల కొద్దీ సమయాన్ని గడపాల్సిన అవసరం లేదు. అలానే వ్యాయామం కోసం ఆఫీస్ కు ఆలస్యంగా వెళ్ళక్కర్లేదు. దీనికోసం తక్కువ సమయాన్ని కేటాయించి మంచి ఆరోగ్యం పొందవచ్చు. అందుకే మేము మీకోసం తక్కువ సమయంలో చేయగలిగే, మీరు ఆఫీస్ కు బయలుదేరే ముందు ఇంట్లో చేయగలిగే వ్యాయామాలను అందిస్తున్నాం, ఇవి పాటిస్తే చాలు వ్యాయామం చేయలేదన్న బాధ కూడ ఉండదు, మరియు ఆరోగ్యంగా కూడా ఉండచ్చు.

అయితే పరికరాలు లేకుండా వ్యాయామం చెయొచ్చంటే, దాని ఉద్దేశం ఇంట్లో ఎటువంటి వ్యాయామాలైన చేయమని కాదు. ఫిట్ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దాని కంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఈ వ్యాయామాలకు సరైన సమయం ఉంది. మరియు వాటిని ప్రదర్శించే ముందు ట్రైనర్‌తో చర్చించాలి. దీనికోసం సిటీకి చెందిన ఫిట్ నెస్ ట్రైనర్ హర్ష సలుంఖే, మహిళల కొరకు ఇంట్లో చేసే వ్యాయామాలను సూచిస్తున్నారు. సెలవుల్లో, బిజీ షెడ్యూల్ సమయంలో ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం. ఆదేశాల మేరకు వారు ఆ క్రమాన్ని అనుసరించాలని ఆమె తెలిపారు. ఫిట్ నెస్, వ్యాయామాల కోసం ఇంటర్నెట్ లో వీడియోలను అనుసరించడం ప్రమాదకరమని హర్ష అభిప్రాయపడ్డారు.

Also Read : ఆఫీస్‌కి వెళ్లే ముందు ఇలా చేస్తే ఎక్కువ జీతం వస్తుందట..

సాధారణంగా ఇటువంటి వ్యాయామ వీడియోలలో ఉన్న వ్యక్తులు ఫిట్ గా ఉంటారని అందువల్ల వారు కష్టమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు అవి తేలిగ్గా ఉంటాయని, అందువల్ల అవి చాలా సులభంగా అనిపించేలా చేస్తాయని చెబుతున్నారు. వాస్తవానికి, పరిస్థితి భిన్నంగా ఉంటుంది. చాలా మందికి ఒంట్లో సరిపడ స్టామినా ఉండదు, మరియు మీరు ఒకవేళ మీరు అందులో ఉన్నట్టు వ్యాయామం చేస్తే, మీకు తీవ్రమైన గాయాలు అవుతాయి. కాబట్టి, ఇంటి వద్ద ఫిట్ నెస్ కోసం రోజు వ్యాయామం చేయాలనుకుంటే ముందుగా ఫిట్‌నెస్ ట్రైనర్‌ని సంప్రదించండి. ఈ వ్యాయామ దినచర్యలో జంపింగ్ జాక్, స్క్వాట్స్, పుష్-అప్స్, ప్లాంక్ వంటి సాధారణ వ్యాయామాలు ఉంటాయి. నెమ్మదిగా జాగింగ్, మార్చింగ్ వ్యాయామం చేసే ముందు శరీరాన్ని సన్నాహం చేయటం మంచిది. ఈ సాధారణ వ్యాయామాల యొక్క విభిన్న కలయికలు, వైవిధ్యాలు పరికరాలు లేకుండా కూడా మంచి వ్యాయామాలు చేయొచ్చు.

కార్డియో వ్యాయామం..

కార్డియో వ్యాయామాలు ఆరోగ్యానికి మంచిది. శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారు కార్డియో వ్యాయామాలను తప్పక చేయాలి. వీటి వలన ఉదరభాగం, తొడలు, పిరుదుల వద్ద ఉండే కొవ్వు పదార్థాలు కరిగించబడతాయి. రన్నింగ్, జంపింగ్ రోప్, స్విమ్మింగ్, ఎరోబిక్స్, సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు కొవ్వు పదార్థాలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. మరియు ఇవి శరీర దృఢత్వాన్ని పెంపొందించడానికి ఉత్తమమైనవి, ఇది మరింత విస్తృతమైన నిత్యకృత్యాలను చేపట్టడానికి మీకు సహాయపడతాయి. మీ వయస్సు, శక్తీ, దృఢత్వం ప్రకారం వ్యాయామాలను మార్చవచ్చు.

Also Read : ఈ టీతో త్వరగా జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి..

పరికరాలు లేని వ్యాయామాల లాభాలు..

అతి చౌకగా ఉంటాయి. మీరు ఖరీదైన వ్యాయామశాలలో చేరాల్సిన అవసరం లేదు. వ్యాయామం చేయటానికి ఫ్యాన్సీ పరికరాలను కొనాల్సిన అవసరం ఉండదు. మీరు చేయాల్సిందల్లా దృష్టి పెట్టడం.ఇంట్లో వ్యాయామం చేయటం వల్ల మరో ప్రయోజనం ఏంటంటే సమయం ఆదా చేసుకోవచ్చు. మార్నింగ్ ఆఫీస్‌కి బయల్దేరే ముందు, సాయంత్రం ఏదైనా పార్టీకి వెళ్లే ముందైనా, ఎప్పుడైనా మీ బిజీ షెడ్యూల్ లో ఖాళీని బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు బోర్ గా కూడా అనిపించదు .

ఎలా చేయలాంటే..

  • ముందు 10 నిముషాలు స్ట్రెచింగ్ , జాగింగ్, మార్చింగ్ చేయండి
  • ఫిట్‌నెస్ కోసం వ్యాయామాలు చేయటానికి శరీరానికి వార్మ్ అప్ వ్యాయామాలు చాలా అవసరం. అందుకే మీరు వ్యాయామం చేసే ముందు స్ట్రెచింగ్ , జాగింగ్, మార్చింగ్ చేయండి .
  • 20 స్క్వాట్స్
  • స్క్వాట్స్ వ్యాయామం వల్ల మీరు బలమైన శరీరాన్ని పొందుతారు, మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మోకాలి కీళ్ళను దృఢపరుస్తాయి. ఇంకా మీ శరీరంలోని హార్మోన్ల స్థాయిని పెంచుతాయి. ముఖ్యంగా స్క్వాట్స్ అమ్మాయిలకు గొప్ప వ్యాయామం, ఎందుకంటే దీని వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా, కండరాలను నిర్మించడంలో కూడా ఇవి సాయపడతాయి. క్రమం తప్పకుండా స్క్వాట్స్ చేయడం వల్ల సెల్యులైట్ ఏర్పడకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

10 పుష్ అప్స్..

పుష్ అప్స్ చక్కటి వ్యాయామం. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని మజిల్స్‌ చురుగ్గా మారుతాయి. ఇది మీ శరీరమంతటికి వ్యాయామం అందిస్తుంది. బరువు తగ్గించేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఛాతి , భుజాలు దగ్గర ఉండే కండరాలు దృఢంగా మారేందుకు తోడ్పడతుంది. పుష్ అప్స్ మీ ఇంట్లోనే సులభంగా చేయొచ్చు. అయితే పుష్ అప్స్ చేసేటప్పుడు కాళ్లను మాత్రం నిటారుగా ఉంచాలి.

20 వాకింగ్ లంజస్

వాకింగ్ లంజస్ మంచి వ్యాయామం . ఈ వ్యాయామం వల్ల మీ పొట్ట దగ్గిర కండరాలు బలంగా మారతాయి. ఇది తొడ దగ్గర కొవ్వు, వీపు కింది భాగంలో పేరుకున్న కొవ్వును కరిగించటానికి చాలా మంచి వ్యాయామం. ఇది మీ మడమల హామ్ స్ట్రింగ్స్ ను స్ట్రెచ్ చేసి, పిక్కలు, కాళ్ళను టోన్ చేస్తుంది.

Also Read : ఈ రాశుల వారు పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ గొడవలేనట..

15 సెకండ్ ప్లాంక్

పొట్ట, పొత్తికడుపు, తొడల కొవ్వును సహజంగా కరిగించే మంచి వ్యాయామాలలో ఒకటి . ఈ వ్యాయామం శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తాయి.ఇవి చేయటం చాలా కష్టం, కానీ ఈ వ్యాయామం పొట్టలోని కండరాలను మాత్రం బలపడేలా చేస్తాయి.

30 జంపింగ్ జాక్స్

గెంతడాన్ని జంపింగ్ జాక్స్ అంటారు. జంపింగ్ జాక్స్ గుండెకు మేలు చేసే ఒక సులువైన వ్యాయామం. అంతేకాక, ఈ వ్యాయామం వల్ల మీ డెల్టాయిడ్ కండరాలు, పిక్కల వద్ద కండరాలు టోన్ చేయబడతాయి. ఈ వ్యాయామం వల్ల మీ గుండె కొట్టుకునే వేగం పెరిగి మీలో ఉత్సాహం నిండుతుంది.

ఈ వ్యాయామాల్నీ నాలుగు నుంచి ఎనిమిది అలా పునరావృతం చేయండి. మీరు ఇది పూర్తి చేసిన తర్వాత స్ట్రెచ్ చేయటం మర్చిపోవద్దు. మీ శరీరంలో దృఢత్వం పెరిగిన తరువాత వ్యయ రౌండ్ల సంఖ్యను పెంచవచ్చు. మీరు మొదటి ప్రయత్నంలోనే సరైన పుష్-అప్ పొందలేకపోతే పర్వాలేదు. గోడకు వ్యతిరేకంగా మిడ్ పుష్-అప్స్ లేదా స్టాండ్ పుష్-అప్స్ కూడా చేయవచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *