workout leggings: ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు లెగ్గింగ్స్ వేసుకుంటున్నారా.. ఈ టిప్స్ మీకోసమే.. – how to choose workout leggings know here some tips


మీ వర్కౌట్స్ ఏమైనా సరే.. యోగా, రన్నింగ్, సైక్లింగ్ – మీ వర్కౌట్స్ లెగ్గింగ్స్ మాత్రం కంఫర్టబుల్ గా, తేమ పీల్చేవిగా, గాలి తగిలేవిగా, ఎక్కువకాలం మన్నేవిగా ఉండాలి. అదేవిధంగా అవి సరిగ్గా సరిపోవాలి, జారిపోకూడదూ, చూడ్డానికి బావుండాలి. ఇవన్నీ ఉండే లెగ్గింగ్స్ ని ఎలా ఎంచుకోవాలో చూడండి.

1. ఫ్యాబ్రిక్ ముఖ్యం..

వర్కౌట్స్ కి కాటన్ కంటే నైలాన్, పాలిస్టర్ మెటీరియల్ బావుంటుంది. అవి ఎక్కువ కాలం మన్నుతాయి, తేమ పీలుస్తాయి, బాగా స్ట్రెచ్ అవుతాయి కూడా. రన్నింగ్ లాంటి హై-ఇంపాక్ట్ యాక్టివిటీస్ కోసం స్మూత్ గా షైనీ గా ఉండే ఫాబ్రిక్ సెలెక్ట్ చేసుకోండి. యోగా లాంటి వర్కౌట్స్ కోసం సాఫ్ట్ ఫాబ్రిక్ ని ఎంచుకోండి.

samayam telugu

iStock-689654176

Also Read : పెళ్ళైన తర్వాత అందుకే బరువు పెరుగుతారట..

2. కుట్టు గమనించండి

లెగ్గింగ్స్ లోపలి వైపు కుట్టు లేచి ఉండకూడదు. ఫ్లాట్ గా ఉండాలి. అప్పుడే చెమట వల్ల చర్మం ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే, లెగ్గింగ్ కాళ్ళని కలిపి కుట్టిన చోట ట్రయాంగ్యులర్‌గా గానీ, డైమండ్ షేప్ లో కానీ బట్ట ఉండేలా చూడాలి. దీన్ని గసెట్ అంటారు. ఈ గసెట్ సరిగ్గా లేకపోతే మూమెంట్ బాగా ఉన్నప్పుడు లెగ్గింగ్స్ పైకి వెళ్ళిపోతాయి.

3. తేమ పీలుస్తోందా లేదా.. చెక్ చేయండి..

ఎక్సర్‌సైజ్ వేర్ తేమ పీలుస్తుందనే అందరూ చెప్తారు. కానీ, అది నిజం కాదు. మీరు కొందామనుకున్న లెగ్గింగ్స్ లోపలి వైపు ఒక చుక్క నీరు వెయ్యండి. ఫాబ్రిక్ వెంటనే ఆ చుక్క నీటిని పీల్చుకోవాలి, నీరు అబ్జార్బ్ అయి వెంటనే స్ప్రెడ్ అవ్వాలి.

Also Read : స్టెప్ పేరెంట్స్ పిల్లల పెంపకంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే.. గొడవలే..

4. ఇది గమనించండి..

మీరు కొందామనుకున్న లెగ్గింగ్స్ ని ఎండలో పెట్టి చూడండి. సీ-త్రూ అయితే తెలిసిపోతుంది. మీరు కొన్న వాటిని కూడా ఒక ఆరునెలలు వాడాక ఇలాగే చూడండి. వాడకాన్ని బట్టి కొన్ని మెటీరియల్స్ పల్చబడతాయి.

5. యోగా కోసం హై-వెయిస్ట్ లెగ్గింగ్స్ బాగుంటాయి. వాటికి పాకెట్స్ కూడా ఉంటే మీ ఫోన్ కూడా అందులో పెట్టుకోవచ్చు.

6. క్యాప్రీస్ వాకింగ్ లాంటి లోయర్-ఇంపాక్ట్ యాక్టివిటీస్ కి బావుంటాయి. వీటి ఫాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది.

7. టైట్స్ ఆల్మొస్ట్ అన్ని రకాల వర్కౌట్స్ కీ సూట్ అవుతాయి. అవి మీరు ఈజీ గా మూవ్ అవ్వడానికి వీలుగా ఉంటాయీ, అలాగే ఫిట్ గా కూడా ఉంటాయి.

samayam telugu

workout istock 7

Also Read : ఈ జ్యూస్‌లతో కాన్సర్ సమస్యలు దూరం..

8. హై-వైస్ట్ ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ హై-ఇంపాక్ట్ వర్కౌట్స్ బాగా సూట్ అవుతాయి. ఇవి ఒంటిని పట్టుకుని ఉంటాయి, అలాగే ఫ్రీ గా కదలడానికి వీలుగా ఉంటాయి. రెపిటిటివ్ మూమెంట్స్ వల్ల ఇరిటేషన్ రాకుండా చూస్తాయి.

9. లైట్-వెయిట్ లెగ్గింగ్స్ లో-ఇంపాక్ట్ వర్కౌట్స్ కి బాగా పనికొస్తాయి. ఇవి నడుం దగ్గర పట్టడం కానీ, మడతలు పడడం కానీ జరగవు. అయితే వీటిని వాషింగ్ మెషీన్ లో ఉతికేటప్పుడు డెలికేట్ వాష్ ప్రోగ్రాం లో తిరగేసి ఉతకాలి. గాలికి ఆరనివ్వాలి.

10. కంప్రెషన్ లెగ్గింగ్స్ మోకాలి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి బావుంటాయి. అవి రక్తప్రసరణని ఇంక్రీజ్ చేసి వర్కౌట్స్ టైమ్‌లో, ముందూ, తరవాత బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా చూస్తాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *