World Bicycle Day: సైకిల్ తొక్కితే సెక్స్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా.. – amazing health benefits of regular cycling include


సైకిల్ తొక్కడం. ఇది కొన్ని సినిమాల ద్వారా బాగా పాపులర్ అయింది. ఈ సైక్లింగ్ అనేది కేవలం ఓ చోటు నుంచి మరో చోటుకి వెళ్లడమే కాదు.. దీని వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్చులేని ఈ వర్కౌట్‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..

​వెయిట్ లాస్ అయ్యేందుకు..

samayam telugu

బరువు తగ్గడనికి ఒకటే సూత్రం – తిన్న కాలరీల కన్నా కరిగించిన కాలరీలు ఎక్కువుండాలి. సైక్లింగ్ గంటకి నాలుగు వందల కాలరీల నుండి వెయ్యి కాలరీల వరకు కరిగిస్తుంది. పైగా ఇది హాయిగా ఎంజాయ్ చేస్తూ చేసే ఎక్సర్సైజ్. అంతేనా, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. సైకిల్ కీ మనసుకీ ఏం సంబంధం అనుకుంటున్నారా? సైకిల్ ఎక్కి అలా చల్ల గాలి లో ఒక రౌండ్ కొట్టి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. మీ వర్రీస్ నీ ప్రాబ్లంస్ నీ ప్రాసెస్ చేసుకోడానికి సైక్లింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. మరీ ముఖ్యం గా డిప్రెషన్ తో బాధ పడుతున్నవారికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

​కాన్సర్, గుండె జబ్బులు దూరం..

samayam telugu

కాన్సర్ కీ, గుండె జబ్బులకీ ప్రధానమైన కారణం బరువు ఎక్కువ ఉండడం. రెగ్యులర్ గా సైక్లింగ్ చేసేవాళ్ళు ఆటోమేటిగ్గా బరువు తక్కువే ఉంటారు. దాంతో వాళ్ళకి ఈ జబ్బులు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది. వీటితో పాటు..సెకండ్ బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చెయ్యచ్చు

మీరు ఆఫీస్ కి సైకిల్ మీద వెళ్తే కనీసం రెండు మూడు వందల కాలరీలు కరిగిస్తారు. కాబట్టి అక్కడ ఒక చిన్న స్నాక్ తినడానికి మీరు ఆలోచించనక్కర్లేదు.

Also Read : వర్క్ ఫ్రమ్ టైమ్‌లో ఈ టిప్స్ పాటించకపోతే కష్టమే..

​సెక్స్ లైఫ్ ఇంప్రూవ్..

samayam telugu

సెక్స్ మంచిదని అందరికీ తెలిసిన విషయమే. కానీ, రెగ్యులర్ సెక్స్ జీవితకాలాన్ని కూడా పెంచుతుందని చాలా మందికి తెలీదు. సెక్స్ లో యూజ్ చేసే మజిల్స్ అన్నీ సైక్లింగ్ లో కూడా యూజ్ చేస్తారు. దాంతో రెగ్యులర్ సైక్లింగ్ వల్ల బెటర్ సెక్స్ మీ సొంతమౌతుంది. మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. మరింకెందుకు శృంగారాన్ని ఆస్వాదించుదామని ఉన్నవాళ్లంతా.. సైకిలెక్కి కాసేపు చక్కర్లు కొట్టండి

Also Read : రాగి పాత్రలోని నీరు తాగితే గుండె సమస్యలు రావా..

​ఇమ్యూనిటీ మెరుగు..

samayam telugu

మీకు ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుందా? అయితే వెంటనే సైక్లింగ్ స్టార్ట్ చెయ్యండి. సైక్లింగ్ చేసే వాళ్ళకి రెస్పిరేటరీ సిస్టం బాగా పనిచేస్తుంది. అంతే తొందరగా జలుబు చెయ్యదు. ఒక్క రెస్పిరేటరీ సిస్టమే కాదు, సైక్లింగ్ జనరల్ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సైకిల్ తొక్కడం వల్ల.. డైరెక్షన్స్ బాగా తెల్సుస్తాయి. “నాలుగు వందల మీటర్ల తరవాత ఎడమకు తిరగండి, ఇదే లైన్ లో ముందుకు వెళ్ళండి…” లాంటి సూచనల ఆధారంగా ప్రయాణం చేస్తున్న రోజుల్లో ఉన్నాం మనం. ఇవి వదిలేసి సైకిల్ ఎక్కి తిరిగితే ఎటు వచ్చాము, ఎటు వెళ్ళాలి లాంటి వివరాలు మెదడులో రిజిస్టర్ అవుతాయి. లేదా తూర్పు ఎటో కూడా కొన్నాళ్ళ తరవాత మనం మర్చిపోతాం.

బ్రెయిన్ పవర్ మెరుగు..

samayam telugu

ఒక స్టడీ ప్రకారం సైక్లింగ్ చేస్తున్నపుడు మెదడు కి 28% ఎక్కువ బ్లడ్ సరఫరా అవుతుంది. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యిందీ అంటే బ్రెయిన్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుందని లెక్క. అంటే, పెద్ద వయసులో డిమెన్షియా, అల్జైమర్స్ వంటివి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. దీంతో పాటు టైం సేవ్ చేస్తుంది. కార్ కంటే సైకిల్ ఎలా టైం సేవ్ చేస్తుంది అని డౌట్ వచ్చిందా. ఒక్కసారి ట్రాఫిక్ జాం ఊహించుకోండి..కార్లు కదలకుండా అక్కడే ఉంటాయి, సైకిల్స్ మాత్రం సందు చేసుకుని, ఒంపులు తిరుగుతూ, ముందుకెళ్ళిపోతాయి. పైగా పార్కింగ్ కి పే చెయ్యాలి. సైకిల్ కి ఆ ఖర్చు కూడా ఉండదు.

Also Read : కిచెన్ సింక్‌ నుంచి నీరు పోవట్లేదా.. ఇలా చేయండి..

​ఖరీదు లేని వ్యాయామం

samayam telugu

సైక్లింగ్ వల్ల పొందే బెనిఫిట్స్ వేటికీ వేరే ఖర్చు పెట్టక్కర్లేదు. సైకిల్ కి మనం పెట్రోల్ కొట్టించక్కర్లేదు, సర్వీసింగ్ చేయించక్కర్లేదు, నిజానికి టైర్స్ లో గాలి కొట్టించడం తప్ప సైకిల్ కి మనం చేసే పనేమీ ఉండదు. ఇన్ని బెనిఫిట్స్ అసలు ఖర్చు లేకుండా ఎక్కడా దొరకవు, సైక్లింగ్ లో తప్ప.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *