World Milk Day: పాలు తాగితే జీర్ణ సమస్యలు వస్తున్నాయా.. ఇదే కారణం కావొచ్చు.. – is cow milk really healthy or not know here


పాలు.. ఆరోగ్యానికి చాలా మంచిది. తాగండి అని చెబుతుంటారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు అని చెబుతుంటారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ పాలు తాగడం వల్ల పోషకాలు మెండుగా పొందొచ్చని చెబుతుంటారు.. మరి ఈ నేపథ్యంలోనే మరి పాలు ఆరోగ్యానికి మంచివేనా అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆవు పాలు.. ఈ పాలు మంచివా కాదా.. తెలుసుకుందాం..

ఆవుపాలతో ఆరోగ్యం..

samayam telugu

నిజానికీ.. కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.. జీవితాంతం ఆవు పాలు తాగడం వల్ల ప్రతికూల ప్రభావాలు పెరిగే అవకాశం ఉందన్న వాదనలు పెరిగాయి. దీంతో.. కొన్నేళ్లుగా ఆవుపాల వినియోగం కూడా క్రమంగా తగ్గుతోంది.. ఓ పరిశోధన ప్రకారం అమెరికాలో 1970 నుంచి ఆవు పాల వినియోగం 40 శాతం తగ్గింది..

ఆవుపాలను అత్యధికంగా వినియోగించే దేశం భారత్. యూరిపియన్ యూనియన్‌లోని మొత్తం దేశాల కంటే రెట్టింపు పాల వినియోగం ఒక్క భారత్‌లోనే ఉంది.. భారత్‌లోనే పాల వినియోగం అధికంగా ఉంటుంది. మన దగ్గర పుట్టినప్పుడు అమ్మపాలతో మొదలైన ఆ అనుబంధం అమ్మపాలు మరిచాక.. ఆవు పాలు, గేదెపాలతో ముడిపడి ఉంటుంది. ఇది మనం వృద్ధులు అయ్యే వరకూ కూడా కొనసాగుతూ ఉంటుంది.

పాలతో జీర్ణ సమస్యలు..?

samayam telugu

ఈ నేపథ్యంలో సోయా, బాదం పాలు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. దీంతో.. కాస్తా ఆవుపాల వినియోగం తగ్గిందనే చెప్పొచ్చు. ఇదేకాక.. పూర్వకాలంలో లాగా ఇప్పుడు ఎవరూ కూడా పాడి పరిశ్రమని వృద్ధి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.. దీంతో ఎక్కడో చోట పాలు దొరుకుతున్నాయి. వినియోగించే వారు ఎక్కువయ్యేసరికి వారు ఆ పాలను కల్తీ చేయడంతో.. జనాలు ప్యాకెట్ పాలను వినియోగంచడం మొదలు పెట్టారు.

మరో కారణం ఈ పాలు అందరికీ జీర్ణం కాకపోవడం కూడా.. ప్రపంచ జనాభాలో దాదాపు 65 శాతం మందిలో పాలల్లో ఉండే లాక్టోస్ అనే పదార్థాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యం ఉండడం లేదు. దీంతో జీర్ణ సమస్యలు రావడం, వాటిని తాగకపోవడం జరుగుతోంది.

ఎక్సర్‌సైజ్ చేసేవారికి అధిక లాభం..

samayam telugu

ఆవు పాలల్లో జున్ను, పెరుగు, వెన్న లాంటి ఉత్పత్తులు ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో పోషకాలు, కాల్షియం, ప్రోటీన్‌లు లభిస్తాయని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.. పాలలో ఉండే విటమిన్ ఏ, డీలు ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చక్కని పోషక విలువలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే అవి ఆవు పాలు అని చాలా మంది అభిప్రాయం.

పాలను తీసుకోవడం వల్ల ఐరన్, కాల్షియం, విటమిన్లు, జింక్, అయోడిన్ వంటి పోషకాలన్నీ లభిస్తాయి.

అయితే, వీటికి ప్రత్యామ్నాయంగా మనం తీసుకునే బాదం, సోయా పాలల్లో అలాంటి పోషకాలు ఉండవు. కేవలం చక్కెర శాతం అధికం అంతే..

ఆవు పాలు అనేవి వ్యాయామం చేసేవారికి అత్యధికంగా మేలు చేస్తాయి.

కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఖచ్చితమైన నిష్పత్తిలో ఉండే సంపూర్ణ ఆహారం పాలు. వీటిని తాగడం వల్ల కండరాల పునరుద్ధరణ ఉత్తేజపడుతుంది.

ప్రెగ్నెంట్స్‌కి అదనపు బలం..

samayam telugu

పిల్లలకి కావాల్సిన కాల్షియం ఈ పాల ద్వారా సమృద్ధిగా లభిస్తుంది. గర్భిణీలకు ఈ పాలను తాగమని సూచిస్తుంటారు.. కారణం కడుపులో పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు పాలు బాగా ఉపయోగపడతాయి.

కాల్షియం ఎక్కువగా ఉండే పాలను తాగడం వల్ల ఎదిగే పిల్లలకి మేలు జరుగుతుంది.

ఈ సమస్యలు రావొచ్చు..

samayam telugu

ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి.. సంవత్సరంలోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదు. కారణం పాలల్లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది పిల్లలు జీర్ణం చేసుకోవడం కష్టం.

అదే విధంగా.. పెద్దలు కొవ్వు తక్కువగా ఉన్న స్కిమ్డ్ పాలను తీసుకోవడం తగ్గించాలని సూచిస్తున్నారు నిపుణులు.

పెద్దవారికి విటమిన్లు, ఐరన్ అందేది పాల ద్వారానే కానీ, వాటిని తాగడం తగ్గించాలి.. వీటితో పాటు వెన్న, నెయ్యి, పెరుగు విషయంలోనూ జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు.

కారణం ఇందులో కొవ్వు శాతం అధికంగా ఉండడమే.. సాధారణ వెన్నలో 20 నుంచి 40 శాతం వరకూ కొవ్వు ఉంటుంది.

ఈ పదార్థాలు శరీరానికి పెద్ద మొత్తంలో కేలరీలను అందిస్తుంది. పెరిగన దశలో అధిక మొత్తంలో కేలరీలు అవసరం లేదు. ఈ విషయం తెలియక పాల పదార్థఆలు తీసుకుంటుంటారు. ఈ కారణంగా అధిక బరువు సమస్య ఎదురవుతుంది.

కారణాలు ఏంటంటే..

samayam telugu

ఆవు పాలు తాగడం కొంతమందికి పడవు.. ఈ పాలను తాగడం వల్ల అలెర్జీలు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

ప్రపంచంలో చాలావరకూ లాక్టోజ్ లేని పాలే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో చాలా మంది జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

రోజురోజుకీ ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. దీంతో పాలు మంచివని కొంతమంది.. వీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని మరికొంతమంది రెండు వర్గాలు విడిపోయి చర్చను తెరపైకి తీసుకొస్తున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *