wuhan lab: వుహాన్ ల్యాబ్‌లో మూడు జాతుల గబ్బిలాల కరోనా వైరస్.. సంచలన నివేదిక – chinese wuhan virology lab had three live bat coronaviruses: report


చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా పురుడుపోసుకున్న కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ను వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లోనే జన్యుపరంగా తయారుచేశారని అమెరికా సహ పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ల్యాబ్‌లో మూడు జాతులకు చెందిన గబ్బిలాల కరోనావైరస్ ఉంది..కానీ, ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి గురిచేస్తున్న సార్స్-కోవి2తో ఏదీ సరిపోలడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.50 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్.. తొలిసారి గబ్బిలాల నుంచి ఇతర క్షీరదాల ద్వారా మనుషులకు సంక్రమించినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read Also: మరో ప్రచ్ఛన్న యుద్ధం అంచున అమెరికా-చైనా.. డ్రాగన్ మంత్రి సంచలన వ్యాాఖ్యలు
వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వాంగ్ యాన్‌యీ మే 13 ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచే వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది అభూతకల్పన మాత్రమే అని పేర్కొన్నారు. గబ్బిలాల నుంచి కరోనా వైరస్ వేరుచేసి సేకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద మూడు జాతుల కరోనా వైరస్‌లు కలిగి ఉన్నామని, కానీ, SARS-CoV-2తో పోల్చిచూస్తే అత్యధికంగా సారూప్యత 79.8 శాతానికి మాత్రమే చేరుకుందని ఆమె తెలిపారు.

Read Also: దేశంలో ఆగని కరోనా విజృంభణ.. పాజిటివ్ కేసుల్లో ఇరాన్‌‌కు ఒక్క అడుగు దూరంలో

ప్రొఫెసర్ షీ జంగ్లీ నేతృత్వంలోని బృందం 2004 నుంచి గబ్బిలాల్లో కరోనా వైరస్ గురించి పరిశోధన చేస్తోందని, దాదాపు రెండు దశాబ్దాల కిందట చైనాలో వ్యాపించిన సార్స్ వైరస్ మూలాలను గుర్తించడంపై దృష్టిసారించామని అన్నారు. సార్స్-కోవ్-2 మొత్తం జన్యువులు సార్స్‌తో 80 శాతం మాత్రమే పొలి ఉన్నాయని, రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందనే విషయం తమకు తెలుసని అన్నారు. కాబట్టి, ప్రొఫెసర్ షి జెంగ్ బృందం గత పరిశోధనలో సార్స్ వైరస్‌తో సమానమైన వైరస్లపై దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు.

Read Also: పెళ్లికి ముందు లైంగిక సంబంధం రేప్ కాదు.. ఒడిశా హైకోర్టు సంచల తీర్పు

వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని ట్రంప్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో సహ పలువురు తమపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తొలిసారిగా డిసెంబరు 30న గుర్తుతెలియని వైరస్ నమూనాలను సేకరించి, దాని జన్యు శ్రేణిని జనవరి 2న గుర్తించి, అదే నెల 11న ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదిక సమర్పించామని అన్నారు. అంతేకాదు, ఈ నమూనాలు సేకరించడానికి ముందు వైరస్ గురించి తమ శాస్త్రవేత్తలు ఎలాంటి పరిశోధనలు చేయడంలేదని అన్నారు.

Read Also: సిక్కింను ప్రత్యేక దేశంగా పేర్కొన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రకటన.. చెలరేగిన దుమారం!

వాస్తవానికి, అందరిలాగే, వైరస్ ఉనికిలో ఉందని మాకు కూడా తెలియదని, అలాంటప్పుడు అది మా ల్యాబ్ నుంచి ఎలా లీక్ అయ్యింది? అని ప్రశ్నించారు. అమెరికా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ సైతం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సైంటిఫిక్ అమెరికన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షి మాట్లాడుతూ.. తమ ల్యాబొరేటరీ గతంలో సేకరించి అధ్యయనం చేసిన గబ్బిలాల కరోనా వైరస్‌తో SARS-CoV-2 జన్యు శ్రేణి సరిపోలడం లేదని అన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *