yoga for digestion problems: ఈ ఆసనాలతో మీ జీర్ణ సమస్యలు దూరం.. – yoga poses for a strong digestive system


యోగా కేవలం మానసిక ప్రశాంతతకీ, ఫ్లెక్సిబుల్ గా ఉండడానికీ మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ, యోగా వల్ల వచ్చే ప్రయోజనాలు అనేకం. బీపీ తగ్గించడం దగ్గర నుండీ, పీసీఓఎస్ లక్షణాల నుండి రిలీఫ్ కలిగించడం వరకూ యోగా చేసే అద్భుతాలు అసామాన్యం. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, యోగా లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్, ఎసిడిటీ, కడుపు నొప్పి, బ్లోటింగ్ వంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ని కూడా తగ్గిస్తుంది. ఆహరపు అలవాట్ల వల్ల కానీ, తీసుకుంటున్న మెడికేషన్స్ వల్ల కానీ పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంటే యోగా చేయడం మంచిది. డైజెస్టివ్ ఇష్యూస్ నుండి రిలీఫ్ కొరకు ఇక్కడ కొన్ని యోగాసనాలు ఉన్నాయి, చూడండి.

* ఆనంద బాలాసనం


1. వెల్లకిలా పడుకోండి, రిలాక్స్డ్ గా ఉండండి.
2. మోకాళ్ళు వంచి మీ చాతీ వద్దకు తీసుకురండి.
3. మీ కాలి బొటన వేళ్ళని మీ చేతులతో పట్టుకోండి.
4. మోకాళ్ళని కొంచెం వెడల్పుగా చేసి మీ చంకల వద్దకు తీసుకు రండి.
5. మీ మోకాలు కి పైన మీ మడమ ఉండాలి, అంటే, రెండూ ఒకే లైన్ లో ఉండాలి.
6. ఇప్పుడు పాదాలని నెమ్మదిగా పైకీ కిందకీ కదపడం వల్ల రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది.

* పద్మాసనం

1. ఒక చాప మీద పద్మాసనం వేసుకుని కూర్చోండి.
2. వెన్నెముక నిటారుగా ఉండాలి.
3. మీ అర చేతులు మీ మోకాళ్ళ మీద పెట్టి జ్ఞానముద్ర పట్టండి. అంటే, చూపుడు వేలు, బొటన వేలు కలిపి ఒక సర్కిల్ లా పట్టుకుని మిగిలిన వేళ్ళని తెరిచి ఉంచడం.
4. ఇలా కొన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ఉండండి.
5. రెండవ కాలు పైన పెట్టి ఈ ఆసనాన్ని రిపీట్ చేయండి.

* శలభాసన

1. బోర్లా పడుకోండి, మీ చేతులు మీ పక్కన ఉండాలి, కాలి బొటన వేళ్ళు రెండూ దగ్గరగా ఉండాలి.
2. మీ రెండు చేతులూ మీ తొడల పక్క భాగాన్ని గట్టిగా ఆని ఉండాలి.
3. ఇప్పుడు కాళ్ళూ చాతీ నేల మీద నుండి పైకెత్తండి.

* బాలాసనం

1. యోగా మ్యాట్ మీద మోకాళ్ళ మీద కూర్చోండి.
2. చేతులు మీ పక్కనే ఉండాలి.
3. కాలి బొటన వేళ్ళు దగ్గరగా ఉండాలి, మోకాళ్ళు కొద్దిగా దూరంగా ఉండాలి.
4. ఊపిరి పీల్చి మీ పొట్ట మీ తొడలకి ఆనేలాగా ముందుకి వంగండి.
5. మీ తల మ్యాట్ కి తగిలేలా ఉంచండి.
6. మీ చేతులు ముందుకు చాచండి. మీ అర చేతులు మ్యాట్ కి తగులుతూ ఉండాలి.
5. నాలుగైదు సార్లు ఊపిరి పీల్చి వదిలేవరకూ అలాగే ఉండి స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చేయండి.

* ఉత్థానాసనం

1. నేల మీద నిలబడండి.
2. మీ పాదాలు హిప్-డిస్టెన్స్ లో ఉండేలా చూడండి.
3. ఊపిరి పీల్చి మీ రెండు చేతులూ పైకెత్తండి.
4. ముందుకి వంగి చేతులతో కాలి మడమల పైగా పట్టుకోండి.
5. కావాలనుకుంటే మోకాళ్ళు కొద్దిగా వంచండి, లోయర్ బాక్ మీద ప్రెషర్ తగ్గుతుంది.
6. కొద్ది సెకన్లు ఆగి మీ చేతులని మీ పిరుదుల మీద ఉంచి నెమ్మదిగా లేవండి.

ఇక్కడ ఇచ్చిన కొన్ని టిప్స్ కూడా మీరు పాటించవచ్చు. ఈ టిప్స్ ఫాలో అవ్వడం తో పాటూ ఈ యోగాసనాలు వేయడం వల్ల మీ సమస్య త్వరగా సాల్వ్ అవుతుంది.

1. ఇంట్లో చేసిన ఆహారమే తినండి.
2. మీరు తీసుకుంటున్న ఆహారం లో ఫైబర్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడండి.
3. మీ డైట్ లో హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోండి.
4. నీరు ఎక్కువగా తాగండి. కొబ్బరి నీరు, నిమ్మ రసం, మజ్జిగ కూడా మంచివే.
5. ఒత్తిడికి గురి కాకండి. డీప్ బ్రీదింగ్, మెడిటేషన్, యోగా వంటి వాటి ద్వారా ఒత్తిడి ని దూరం చేసుకోండి.
6. నెమ్మదిగా మీరు తీసుకుంటున్న ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినండి. టీవీ చూస్తూ, మొబైల్ ఛాట్ చేస్తూ తినకండి.
7. మీ ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినండి.
8. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. మిగిలిన టైమ్స్ లో కూడా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండండి.
9. మీ శరీరం మీకు ఏం చెప్తోందో వినండి. వారానికి ఒకసారైనా మీతో మీరు గడపండి.
10. స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం, రాత్రి చాలా లేట్ గా డిన్నర్ చేయడం, డిన్నర్ చేసిన వెంటనే నిద్ర పోవడం వంటి అలవాట్లని మార్చుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *