YSRCP MLA Roja: పుష్ప సినిమాలో రోజా… పవర్ ఫుల్ పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే – ycp mla roja casting as a villain role in allu arjun pushpa movie


అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మరో సినిమా పుష్ప. బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారు. ఆయన జోడీగా రష్మిక మందన్న కనిపించబోతుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో.. త్వరలోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు సుకుమార్. కాగా ఇందులో విలన్ పాత్రకు గానూ విజయ్‌ సేతుపతి, బాబీ, సునీల్ శెట్టి ఇలా పలువురి పేర్లు వినిపించాయి. ఇక ఆ పాత్రను పక్కన పెడితే ఈ మూవీలో మరో పవర్ ఫుల్ పాత్రలో టాలీవుడ్ ప్రముఖ నటి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పుష్ప సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం సుకుమార్ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాను సెలక్ట్ చేసినట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రోజాను సంప్రదించడం, పాత్ర నచ్చి సినిమాలో నటించేందుకు రోజా ఒప్పుకోవడం జరిగిపోయాయని తెలుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత రోజా ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. ఆ మధ్యన బోయపాటి, బాలయ్య సినిమాలో రోజా నటించబోతున్నట్లు వార్తలు వచ్చినా.. దర్శకుడు వాటిని ఖండించారు.

పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రోజా.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో మెప్పించారు. బన్నీ సినిమాకు రోజా నిజంగానే ఓకే చెప్పి ఉంటే టాలీవుడ్‌లో రేర్ కాంబో ఫిక్స్‌ అయినట్లే. అంతేకాదు రోజా విలనిజం ఈ సినిమాకు మరో ఆకర్షణగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప సినిమాకు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐదు భాషల్లో రాబోతున్న ఈ చిత్రంపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *