zodiacsigns and relationship: ఈ రాశి వారిని పెళ్ళి చేసుకుంటే ఎలాంటి గొడవలు రావట.. – which zodiac sign is best in relationship know here all details in telugu


ప్రతి బంధమూ ప్రత్యేకమైనదే. అలాగే, మీకు నచ్చినా నచ్చకపోయినా ఏ బంధమూ పర్ఫెక్ట్ కాదు. ఇది అంగీకరించక తప్పని సత్యం. మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చాలా ఇంటెన్స్ అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు, కానీ వాటిని డీల్ చేసే విషయంలో కొంత మెచ్యూరిటీ మీకు అవసరం. అయితే, ఈ మెచ్యూరిటీ అనేది వయసుని బట్టి మాత్రం రాదు. అలాగే, రీజనింగ్ కీ, లాజిక్ కీ కూడా ఇందులో ప్లేస్ లేదు. మీరు ఏ విషయన్నైనా ఎంత బాగా అర్ధం చేసుకోగలరో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు సహనంగా ఉండాలో మీకు క్లియర్ గా తెలిసి ఉండడాన్ని బట్టి ఈ మెచ్యూరిటీ వస్తుంది. ఇది కొచెం కష్టమైన విషయమే. కానీ, కొంత మందికి మాత్రం ఈ క్వాలిటీసన్నీ ఉంటాయి. వారు వారి రిలేషన్‌షిప్స్ ని ఎంతో బాగా డీల్ చేసుకోగలరు. అయితే, అందరికీ ఈ క్వాలిటీస్ ఉండవు. అది కూడా వారి రాశిని బట్టి ఉంటుంది. ఏ రాశి వారు వారి రిలేషన్‌షిప్స్ విషయంలో మెచ్యూర్డ్ గా డీల్ చేస్తారో చూడండి మరి.

Also Read : ఈ టిప్స్ పాటిస్తే పళ్ళు తెల్లగా మెరుస్తాయి..

వృషభ రాశి

వృషభ రాశి వారు కొన్ని సందర్భాల్లో చాలా ప్రాక్టికల్ గా, ఇమ్మెచూర్ గా కనిపించవచ్చు. కానీ, రిలేషన్‌షిప్స్ ని డీల్ చేసే దగ్గర మాత్రం వారు చాలా సెన్సిబుల్ గా ఉంటారు. పరిస్థితిని క్లియర్ గా అంచనా వేసుకుని దానిని వారికి అనుకూలంగా మార్చుకోగలరు వీరు. రకరకాల సిచ్యుయేషన్స్ ని ఎలా మ్యానేజ్ చేయాలో వీరికి బాగా తెలుసు. అనుకున్న దానికన్నా బాగా వీరు ఇలాంటి విషయాలని హ్యాండిల్ చేయగలుగుతారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఎక్కువ భావోద్వేగాలతో ఉంటారు. అందుకనే, మనసుకి సంబంధించిన విషయాల్లో వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అసలే ప్రాబ్లమాటిక్ గా ఉన్న సిచ్యుయేషన్ ని వారు ఇంకా ప్రాబ్లమాటిక్ అవ్వకుండా కాపాడుతారు. అలాగే, వారి పార్ట్నర్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని అంగీకరించి సమాధానపడే విషయం లో కూడా వారి సమస్య యొక్క మూలాలని చూస్తారు తప్ప త్వరపడి ఒక కంక్లూజన్ కి రారు.

Also Read : మలేరియా వచ్చాక ఈ ఫుడ్ తింటే త్వరగా కోలుకుంటారట..

కన్య రాశి..

కన్య రాశి వారి విషయం లో అసలు తప్పు జరిగేందుకు అవకాశం లేదు. అందుకనే వారు ప్రతి విషయాన్నీ సునిశితంగా పరిశీలించి సెన్సిబుల్ గా ఆలోచిస్తారు. ప్రేమ కి సంబంధించిన విషయాల్లో వారు కొంచెం ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ గా ఉండవచ్చు. కానీ, వారి రిలేషన్‌షిప్స్ లో ఉండే సమస్యలని వారు ఎంతో ఓపికతో సహనంతో ఎదుర్కొంటారు. వారిలో ఉన్న ఆకర్షణకు ఇది కూడా ఒక కారణం.

తులా రాశి..

తులా రాశి వారెప్పుడూ సమతూకంతో ఉంటారు, రిలేషన్‌షిప్స్ విషయంలో అయినా అంతే. వారి పార్ట్నర్స్ తో ఉన్న బంధం ఎంత దృఢంగా, సురక్షితంగా ఉంది అన్న దాని మీద ఎక్కువ దృష్టి పెడతారు. అదే సమయం లో బాగా అర్ధం చేసుకుంటారు కూడా. బంధాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఎప్పుడు వారి అభిప్రాయాలను పంచుకోవాలో, ఎప్పుడు దాచుకోవాలో వారికి బాగా తెలుసు.

మకర రాశి..

రాశులన్నింటిలోనూ వీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఎంత క్లిష్టమైన పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో వీరికి బాగా తెలుసు. వీరికి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఎక్కువే. అనవసరమైన విషయాల్లో జోక్యం కలుగ చేసుకోవడాన్ని వీరు ఇష్టపడరు. అదే సమయం లో రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ని ఎంతో అనుభవమున్న వారిలా డీల్ చేస్తారు. పరిస్థితులకి అనుగుణంగా ఎలా వ్యవహరించాలో వీరికి బాగా తెలుసు.

Also Read : అలోవేరా రాస్తే తామర తగ్గుతుందా..

కుంభ రాశి..

అన్ని రాశుల్లోకీ కుంభ రాశి వారిని మేధావులుగా పేర్కొంటారు. వారు తెలివిగా ఉంటారు, చమత్కారంగా మాట్లాడతారు. అదే సమయం లో బంధాలలో ఉండే భావోద్వాగాల విషయంలో వారు ఎంతో నిజాయితీతో, పరిపక్వత తో వ్యవహరిస్తారు. వారికి స్వంతత్రత యొక్క విలువ తెలుసు, అనవసరంగా ఇంకొకరి విషయం లో జోక్యం కలుగ చేసుకోరు, వారి పార్ట్నర్ అయినా సరే. అందుకే వీరు చాలా లిబరల్ గా అనిపిస్తారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *